మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు మీడియాపై పిచ్చి కోపం వచ్చింది. తన నియోజకవర్గంలోని వరద బాధితులతో లీడర్లని/ ప్రభుత్వాన్ని తిట్టించారనే ఆగ్రహంతో తొలివెలుగు అనే వెబ్ ఛానెల్ జర్నలిస్ట్‌ని పట్టుకొని పచ్చిబూతులు తిట్టారు. అమ్మ .. అయ్య... అంటూ బీప్ సౌండ్లతో చెలరేగిపోయారు. మరోసారి తన నియోజకవర్గంలో కాలుపెడితే విరగ్గొడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.
మల్కాజిగిరిలో వరద పరిస్థితిని V6, ABN ఆంధ్రజ్యోతి, TV 5 ఛానెల్స్ బ్యాలెన్స్ చేసి చూపిస్తే.. తొలివెలుగు ఛానెల్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం ప్రసారం చేసిందని.. ఆ ఛానెల్ యాంటీ గవర్నమెంట్ ఛానెల్ అంటూ దుమ్మెత్తిపోశారు. వరద బాధితులందరినీ ఒకేసారి ఆదుకునేందుకు తానేమి దేవుడిని కాదని, అందరిముందూ ఒకేసారి ప్రత్యక్షం కావడానికి తనకు మంత్రాలు రావంటూ అసహనం వ్యక్తం చేశారు.
వాస్తవానికి మైనంపల్లి హనుమంతరావు రిపోర్టర్‌ని ఉద్దేశించి.. బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. సదరు రిపోర్టర్ చెప్పినవి అవాస్తవమైతే.. దాన్ని నిరూపించి తగిన బుద్ధిచెప్పాల్సింది. ఎక్కడైతే ఆ రిపోర్టర్ న్యూస్ కవర్ చేశాడో.. అదే జనాన్ని పోగేసి జర్నలిస్టు అబద్ధాలు ప్రచారం చేశాడంటూ కడిగేయాల్సింది..కానీ జనం తనను తిట్టారని తన కోపాన్ని మీడియాపై చూపెట్టడం ఏ మాత్రం సరికాదు. ఇప్పుడంటే పార్టీకో చానెల్ ఉంది కాబట్టి పరిస్థితి వేరే ఉంది.. కానీ మీడియా అంటేనే ఓ ప్రతిపక్షం మైనంపల్లిగారూ.. ఆరోపణలు వస్తే ఖండించాలి లేదా కాదని నిరూపించాలి అంతేగాని మీడియాను అడుగుపెట్టనీయను.. కాలు విరగ్గొడతాను అంటే ఎలా చెప్పండి!
ఇంతకి ఎమ్మెల్యే మైనంపల్లికి కోపం తెప్పించిన ఆ వార్త ఏమిటి.. దాన్ని చూశాక ఆయన రియాక్షన్ ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ లింకులను చూడండి!
తొలి వెలుగు ప్రసారం చేసిన వార్త లింక్
0 Comments